వైసీపీ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పక్షానికి అవసరం లేకపోయినా చంద్రబాబు అండ్ సన్ మినహా అందర్నీ వైకాపాలోకి ఆపరేషన్ జగన్ ఆకర్ష్ పేరుతో లాగేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలొస్తున్నాయి. తాజాగా గుంటూరులో పట్టు సాధించేందుకు బెజవాడకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి గెలిచిన వెల్లంపల్లి తన సొంత సామాజిక వర్గంలో పట్టులేదని సొంత పార్టీ నేతల నుంచే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న వెల్లపంల్లి ఇప్పుడు తన వర్గాన్ని తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి కాలంలో వెల్లంపల్లి వైశ్య సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుంటూరు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. తన సామాజిక వర్గం వారు ఏ పార్టీలో ఉన్నా అధికార పార్టీ వైపు లాగుతున్నారని గుంటూరు లోకల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే గా ఎన్నికైన మద్దాలి గిరి తర్వాత వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. గిరి వెనుక చక్రం తిప్పింది వెల్లంపల్లేనని అప్పట్లో టాక్ వినిపించింది. దీంతో వెల్లంపల్లికి జగన్ దగ్గర మంచి మార్కులు పడ్డాయి.
అయితే ఇక్కడ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి జగన్ కి మంచి సన్నిహితుడు. స్థానికంగా బలమైన నాయకుడు కూడా. అయితే అప్పిరెడ్డి చేయలేని పనిని వెల్లంపల్లి గిరి ద్వారా చేస్తున్నారుట. గుంటూరులో తమ సామాజిక వర్గాన్ని మొత్తం గిరి ద్వారా గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారని…ఇది జగన్ కి కలిసొచ్చే అంశంగా మారుతుందని అంటున్నారు. గుంటూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట గా ఉండేది. అక్కడ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అధికంగా చేసేది. గుంటూరు మొత్తం చంద్రబాబు కనుసన్నలోనే ఉండేది. కానీ గత ఎన్నికల్లో వైకాపా వాటన్నింటిని తుడిచిపెట్టేసిన సంగతి తెలిసిందే.