Varun Tej’s Ghani : రీసెంట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన చిత్రాల్లో మెగా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “గని” కూడా ఒకటి. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమా గత శుక్రవారమే రిలీజ్ అయ్యింది.
అయితే ఈ సినిమాకి అసలు ఎలాంటి హైప్ నమోదు కాలేదు.
లాస్ట్ మినిట్ వరకు మెగా హీరోలు అంతా ఏదో ట్రై చేసారు కానీ వరుణ్ తేజ్ కెరీర్ లో అయితే ఈ సినిమా అనుకున్న స్థాయి ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు అలాగే టాక్ కూడా సంతరించుకోలేదు. దీనితో చాలా పూర్ ఓపెనింగ్స్ అయితే ఈ సినిమాకి దక్కాయి.
అలాగే మొదటి మూడు రోజులు అయితే ఈ సినిమాకి కేవలం 4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది అంటే అర్ధం చేసుకోవచ్చు సినిమా వసూళ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అనేది. దీనితో టాలీవుడ్ లో ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచిపోయేలా ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.
నమ్మేలా లేదు కానీ ఈ సినిమాకి ఏకంగా 40 కోట్ల వరకు కొత్త నిర్మాతలు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇది పక్కన పెట్టినా మినిమమ్ బిజినెస్ ని ఈ సినిమా జరిపింది ఇప్పుడు ఈ రెంటికి ఎలా చూసా 35 కోట్ల మేర నష్టమే మిగిలేలా ఉందని టాక్.
దీనితో ఈ సినిమా వరుణ్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాలో నూతన నటి సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు.