వరుణ్ తేజ్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగ బాబు

ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒక మినిమం గ్యారంటీ ఉన్న హీరో. లేని పోనీ స్టార్ ఇమేజ్ కోసం పోకుండా….మంచి సినిమాలు చేస్తూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. సాధారణంగా అందరితో కలిసి మెలిసి ఉంటూ, వివాదాలకు దూరంగా ఉండే వరుణ్ తేజ్ కి తన తండ్రి నాగబాబు గట్టి వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో చాలా కాలం గా సన్నిహితంగా ఉంటున్నాడు. ఆ మధ్య వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి.

రీసెంట్ గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రైవేట్ పార్టీలో రచ్చ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఓ కామన్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కలిసిన ఇద్దరు పార్టీలో రచ్చ రచ్చ చేసారంట. వీలతో పాటు ఈ పార్టీలో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడు.

అయితే ఇన్నాళ్లు లావణ్య వరుణ్ తేజ్ లవ్ ఓన్లీ రూమర్ అనుకున్న అభిమానులకు ఈ ఫొటోస్ చూసిన తరువాత వీళ్ళ మధ్యలో ఏదో ఉంది అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ విషయం తెలిసిన నాగబాబు ఇంకో సారి వరుణ్గ వరుణ్ తేజ్ గట్టి వార్నింగ్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. హీరోయిన్స్ ని ఇంటి కోడలుగా తెచ్చుకునే ఆలోచన తనకు లేదని… లావణ్య కు దూరంగా ఉండు..లేకపోతే..నా కోపానికి బలైపోతావు అంటూ ఘాటుగానే చెప్పుకొచ్చారట. మరి ఈ విషయం పై వరుణ్ తేజ్ ఎలా స్పందిస్తాడో తెలియాలి.