అయోమయం లో మెగా హీరో

మెగా హీరోల్లో వరుణ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే కథలతో, మంచి హిట్స్ తో దోసుకుపోతున్నాడు. ‘గాని’ లాంటి ప్లాప్ వచ్చినా….’ఎఫ్ ౩’ లాంటి హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలా అని అయోమయంలో పడ్డట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం వ‌రుణ్ కొత్త క‌థ‌ల్ని విని, ఓకే చేసుకొనే ప‌నిలో ఉన్నాడు. మీ మెగా హీరో ప్ర‌వీణ్ స‌త్తారుతో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చి కూడా చాలా కాలం అయ్యింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమా పైన ఎలాంటి అప్‌డేటూ లేదు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కాస్త డైలామాలో ఉంద‌ని తెలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు ముందుకీ వెన‌క్కి ఊగుతోంద‌ని, వ‌రుణ్ తేజ్ ఈ క‌థ‌ని హోల్ట్ లో పెట్టాడ‌ని టాక్‌. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోసం ఇప్ప‌టికే నిర్మాత కొంత మొత్తం ఖ‌ర్చు పెట్టాడు. విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అక్క‌డ వీసాల కోసం ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి.

ప్ర‌వీణ్ స‌త్తారు ప్ర‌స్తుతం నాగార్జున‌తో ‘ఘోస్ట్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనిపై కూడా ఎలాంటి బ‌జ్ లేదు. అందుకే నిర్మాత ఈ ప్రాజెక్టుని వెయిటింగ్ లిస్టులో పెట్టారేమో అని అనుకుంటున్నారు. ఒక‌వేళ ఘోస్ట్ రిలీజ్ అయి, హిట్అ అయితే అప్పుడు వరుణ్ తేజ్ సినిమా మీద ఏదైనా క్లారిటీ రావొచ్చేమో వేచి చూడాలి.