Varun Admits Flop : ‘వినయ విధేయ రామ’ సినిమా ఫ్లాప్ అని రామ్ చరణ్ ఒప్పుకున్నాడు. ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు. అలాగే, ‘టక్ జగదీష్’ సినిమా ఫ్లాప్ కూడా నాని ఒప్పేసుకున్నాడు. సినిమా హిట్టా.? ఫ్లాపా.? అనేది తేల్చేది ప్రేక్షకులే అందులో నో డౌట్.
అయితే, కొందరు హీరోలు తమదైన బాధ్యతతో తమ ఓటమిని ఒప్పుకుంటున్నారనుకోండి.
లేటెస్టుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సినిమా ‘గని’ ఫ్లాప్ అని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. గతంలో ‘వినయ విధేయ రామ’ సినిమా ఫ్లాఫ్ అయినా ఆ సినిమా కారణంగా ఎవరూ నష్టపోలేదు. టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబట్టింది ఆ సినిమా.
అయితే, ఇప్పుడు ‘గని’ విషయంలో నిర్మాతలు బాగా నష్టపోయారనేది ట్రేడ్ పండితుల అంచనా. ఆ సంగతి అటుంచితే, ఈ మధ్య చాలా చాలా చెత్త సినిమాలొచ్చాయ్. ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయ్. అలా అని ఆ హీరోలంతా తమ ఓటమిని అంగీకరించలేదు.
కెరీర్‌లో హిట్టూ, ఫ్లాప్ అనేవి సహజం. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోంది. ఆ మేనియాలో ‘గని’ కొట్టుకుపోయిందంతే. ‘ఆర్ఆర్ఆర్’ మేనియాలోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు ప్రేక్షకులు. అలాంటిది ఈ టైమ్‌లో ‘గని’ రిలీజ్.
వాస్తవానికి ‘గని’ రిలీజ్ టైమ్ బ్యాడ్ అని సినీ మేధావులు భావిస్తున్నారు. డ్రైసీజన్‌లో రిలీజ్ చేసుకోవల్సిన సినిమా ఇది. అలాంటిది ఈ సీజన్‌లో రిలీజ్ చేసి, మేకర్లు తప్పు చేశారు.
సినిమా ఫ్లాప్ అని ఒప్పుకుని వరుణ్ తేజ్ ఇంకో తప్పు చేశాడంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.