Varun Tej: ప్రెగ్నెన్సీ భార్య కోసం చెఫ్ గా మారిన మెగా హీరో… వైరల్ అవుతున్న వీడియో!

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఇటీవల ఈమె తన ప్రేగ్నెన్సీ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు.

ఇలా మెగా కుటుంబంలోకి మరొక బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారనే తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే తన ప్రేగ్నెన్సీ భార్య కోసం వరుణ్ తేజ్ ఏకంగా చెఫ్ గా మారిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైనా తినాలని కోరికలు కలుగుతూ ఉంటాయి. అయితే లావణ్య త్రిపాటికి కూడా ఇలాంటి క్రేవింగ్ రావడంతో తన భార్య కోసం ఈయన చెఫ్ గెట్ అప్ వేశారు.

ఇంట్లో ఎంతో మంది చెఫ్ లు ఉన్నా సరే తానే స్వయంగా భార్య కోసం పిజ్జా తయారు చేశాడు.వరుణ్‌ పిండి కలుపుతూ.. పిజ్జాకు కావాల్సినవన్నీ తానే ఏర్పాటు చేసుకున్నాడు. చివరకు పిజ్జా తయారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇది చూసిన అభిమానులు వరుణ్ తేజ్ కు లావణ్య అంటే ఎంత ప్రేమ అంటూ కామెంట్లో చేస్తున్నారు.

ఇక లావణ్య , వరుణ్ తేజ్ ఇద్దరు కూడా రెండు సినిమాలలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఎట్టకేలకు ప్రేమ విషయాన్ని బయట పెడుతూ పెద్దల సమక్షంలో 2023వ సంవత్సరంలో ఈ జంట ఇటలీలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా పెళ్లయిన త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారని తెలుస్తుంది.