Korean Kanakaraju: వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ, #VT15 టైటిల్ కొరియన్ కనకరాజు- థ్రిల్లింగ్ గ్లింప్స్ రిలీజ్

Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ#VT15, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. హర్రర్, కామెడీని క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో బ్లెండ్ చేస్తూ VT15 ఇండియన్, కొరియన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.

వరుణ్ తేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను థ్రిల్‌ అందించే గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేశారు. టీజర్ కొరియన్ పోలీసులు సత్యను క్రూరంగా కొట్టి ఇంటరాగేషన్ చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. తను అనంతపురంలోని పెనుకొండకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని చెబుతాడు.

అప్పుడు రితికాఎంటర్ అవుతుంది “మీరెవడిని వెతుకుతున్నారో అతను కాదు… మీరు వెతుకుతున్నది కనకరాజు” అంటూ క్లారిటీ ఇస్తుంది. ఒక్కసారి వైబ్ మారిపోతుంది- రక్తం-పౌర్ణమి.. గబ్బిలాలు గుంపులుగా రావడం, ఒక పాత్ర పైన ఉన్న డ్రాగన్ భయంకరమైన శబ్దాలు చేస్తుంది. అప్పుడు, హీరో తన చేతిలో మెరిసే కత్తితో అడుగుపెడతాడు. తరువాత ఊచకోత మొదలౌతుంది. కనకరాజు టేబుల్ పైన కూర్చుని, ఓ చిరునవ్వు నవ్వి ఇంటెన్స్ గా చూసి “నేను తిరిగి వచ్చాను’ అని కొరియన్ భాషలో చెప్పడం, స్క్రీన్ పై కొరియన్ కనకరాజు (కోకా) అనే టైటిల్ రావడం అదిరిపోయింది.

వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం కంప్లీట్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. ఆయన లుక్ ప్రజెన్స్ అదిరిపోయింది. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. రితికా నాయిక్ హీరోయిన్‌గా ఆకట్టుకుంటే, సత్య తనదైన టైమింగ్‌తో మరోసారి నవ్వులు పండించారు.

దర్శకుడు మేర్లపాక గాంధీ మరోసారి తన ప్రత్యేకమైన నెరేటివ్ స్టైల్‌ తో అదరగొట్టారు. వినోదం, యాక్షన్, హారర్ ని అద్భుతంగా మేళవిస్తూ ఒక ఫస్ట్–ఆఫ్–ఇట్స్–కైండ్ గ్లింప్స్‌ అని అందించారు.

మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా వుంది, థమన్ థంపింగ్ బీజీఎం గూస్‌బంప్స్ గ్యారంటీ. ప్రొడక్షన్ విలువ్స్ టాప్ నాచ్.

మొత్తానికి, ఈ గ్లింప్స్ ఒక వైల్డ్, డిఫరెంట్ సినిమాకు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది. అంచనాలు లెవెల్‌కు వెళ్ళాయి. ఇది వరుణ్ తేజ్ కి పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ గా నిలిచింది. గ్లింప్స్ ద్వారా మేకర్స్ 2026 వేసవిలో థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

తారాగణం: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య

రచన, దర్శకత్వం : మేర్లపాక గాంధీ
నిర్మాతలు: UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: మనోజ్ రెడ్డి కటసాని
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్టాగ్ మీడియా

రిపోర్టర్ Vs రేణుదేశాయ్ || Renu Desai Fires On Reporter || Renu Desai Vs Reporter || Telugu Rajyam