మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన టీమిండియా, మూడో వన్డేలో చివరికి సత్తా చాటింది. సిరీస్‌ను కోల్పోయినా, అభిమానులకు మాత్రం ఈ విజయంతో గట్టిగా ఊపిరిపీల్చే అవకాశం లభించింది. ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మన్‌లు చిత్తు చేశారు. కేవలం 38.3 ఓవర్లలో టార్గెట్‌ను చేజ్ చేస్తూ భారత్ ఘన విజయం సాధించింది.
టీమిండియా తరఫున ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ షో చూపించాడు. 121 పరుగుల అద్భుత సెంచరీతో తన శైలిలోనే దుమ్ము రేపాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 3 సిక్సులు ఉండగా, ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (24) మళ్లీ పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ (74) రోహిత్‌తో కలసి 168 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. ఈ జోడీ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది.
మొత్తానికి భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్‌ను 38.3 ఓవర్లలో ఫినిష్ చేసింది. ఆస్ట్రేలియా తరఫున హేజెల్‌వుడ్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. సిరీస్ ఫలితం 2-1తో ఆసీస్ పక్షానికే వెళ్లినా, చివరి మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన మాత్రం సిరీస్ మొత్తం స్ఫూర్తిని మార్చేసిందని చెప్పొచ్చు.
అంతకుముందు మొడట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలవలేకపోయింది. హర్షిత్ రాణా మళ్ళీ తన ప్రతిభను చాటుతూ 4 వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుత బౌలింగ్‌కు ఆసీస్ బ్యాట్స్‌మెన్ దారితప్పారు. రెన్ షా (58 బంతుల్లో 56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ (41), షార్ట్ (30) కొంత పోరాడినప్పటికీ, లోయర్ ఆర్డర్ మాత్రం పూర్తిగా కుప్పకూలిపోయింది. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీసి ఆసీస్‌ను 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
భారత్ ఈ మ్యాచ్‌ను సులభంగా గెలవడమే కాకుండా, టీమిండియా బౌలింగ్ యూనిట్ మరియు బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ రెండింటి నుంచి సమతౌల్య ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా యువ బౌలర్ హర్షిత్ రాణా ప్రదర్శన టీమిండియాకు భవిష్యత్తులో పెద్ద ఆస్తిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
