రష్మిని ముద్దు పెట్టుకోబోయిన వర్ష.. రష్మి రియాక్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

ప్రముఖ బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్ తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన రష్మి ఈటీవీలో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో సందడి చేస్తోంది. సుధీర్ తో లవ్ ట్రాక్ వల్ల రష్మి బాగా పాపులర్ అయ్యింది. దీంతో అందరూ రష్మిని అక్క అంటే సుధీర్ ని బావ అని అంటుంటారు. అయితే కొంతకాలంగా సుధీర్ జబర్థస్త్ లో కనిపించటం లేదు. అంతే కాకుండా శ్రీదేవీ డ్రామా కంపెనీ షో కొంత కాలం యాంకర్ గా చేసి తర్వాత మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో లో అనసూయతో కలసి యాంకరింగ్ చేస్తున్నాడు.

శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో సుధీర్ స్ధానంలో రష్మి ఎంట్రీ ఇచ్చి సింగిల్ గా యాంకరింగ్ చేస్తూ తన పర్ఫార్మెన్స్ తో సందడి చేస్తోంది. ఈ షో లో ఆది రాంప్రసాద్ రష్మిని తమ పంచులతో ఒక ఆట ఆడుకుంటారు. ఇన్ డైరెక్ట్ గా బాబు బాబు అంటూ సుధీర్ గురించి ప్రస్తావిస్తూ కౌంటర్లు వేస్తుంటారు. అయినా కూడా రష్మి ఏమాత్రం ఫీల్ అవ్వకుండా వాటిని చాలా స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది. ఇక రష్మి కూడా వారికి ఏమాత్రం తగ్గకుండా రివర్స్ కౌంటర్లు కూడా వేస్తుంది. తాజాగా ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ప్రోమో కూడా ఎప్పటిలాగా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయనుంది. ఇక ఈ మధ్య ఆది, రాంప్రసాద్ తో పాటు వర్ష కూడా అక్క అక్క అంటూ రష్మి మీద కౌంటర్లు వేస్తుంది. ఇటీవల విడుదలైన ప్రోమోలో కూడా వర్ష అక్కా అక్కా అంటూ వచ్చి బావ నీకు ఒకటీ ఇవ్వమన్నాడు అంటూ వర్ష నాటకాలు ఆడుతుంటుంది. వర్ష అక్క అక్క అంటూ పెట్టే టార్చర్ భరించలేక రష్మీ విసుగుచెంది ఎవరే నీకు అక్కా అని అంటుంది. ఈ క్రమంలో వర్ష రష్మీ వద్దకు వచ్చి .. అక్క బావ నీకు బావ ఒకటి ఇవ్వమన్నాడు.. నువ్వు కళ్లు మూసుకో చూపిస్తా? అని వర్ష అంటే.. నువ్వు చూపిస్తావా? వామ్మో అని రష్మి డబుల్ మీనింగ్‌లో అనేస్తుంది. అది కాదు అక్కా..నువ్ కళ్లు మూసుకో అని వర్ష అంటుంది. రష్మి కళ్లు మూసుకునేలోపు వర్ష వచ్చి రష్మి కి ముద్దు పెట్టబోతోంది. దీంతో రష్మీ షాక్ అవుతుంది. ఛీ ఛీ పక్కకి పో అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. వర్ష చేసిన పనికి అందరూ ఒక్కసారిగ నవ్వారు.