సర్లే.. అని పాపం ఆడియన్స్ కూడా ఏమున్నా, ఏం లేకపోయినా ఈ జంటకు బాగా కనెక్ట్ అయిపోయారు. అసలు విషయంలోకి వెళితే, వర్ష బాగా హర్టయ్యింది. అదీ ఇమ్మాన్యుయేల్ మాటలకు. నన్ను అంత మాట అంటావా.? అంటూ ఎంత సముదాయించినా కూల్ అవ్వలేదు. ఆది, రాంప్రసాద్ వంటి పెద్దలు నచ్చచెప్పి, ఓ రొమాంటిక్ సాంగ్‌కి స్టెప్పులేయించి ఎలాగో కష్టపడి వర్షని కూల్ చేశారనుకోండి.
వర్ష అంటే అంతలా పడి చచ్చిపోయే ఇమ్ము, ఆమె హర్టయ్యేంతలా ఏమన్నాడబ్బా.! అని ఆలోచిస్తున్నారా.? గిల్లితే పాలుగారే మేని ఛాయతో అందంగా మెరిసిపోయే వర్షని అందరూ ‘లేడీ గెటప్పా (అమ్మాయి కాదు..).? అని అడుగుతున్నారట. ఓ స్కిట్ మధ్యలో ఇమ్మాన్యుయేల్, వర్షని ఈ విధంగా సంబోధించాడు. దాంతో వర్ష హర్టయ్యింది.
అయ్యో.! నిజంగానే వర్షని అలా అంటున్నారా.? ఎంత గొంతు కోకిల గొంతు కాకపోతే మాత్రం ఆమె అందం, హాట్‌నెస్ ముందు హీరోయిన్లు సైతం భళాదూర్. (కాస్త ఎక్కువయ్యిందా. అడ్జస్ట్ చేసుకోండి. పాపం వర్ష అంతలా హర్టయ్యింది కదా..) అలాంటిది ఆమెని లేడీ గెటప్పా.? అని అడిగేంత సాహసం ఎవరు చేస్తారు.? కానీ, చేస్తున్నారట. బయట కూడా అందరూ అలాగే అడుగుతున్నారు.. అంటూ వర్ష కూడా వాపోయింది.