కాపు ఉద్యమం నుంచి ముద్రగడ పద్మనాభం నాయకత్వం నుంచి తప్పుకున్న తర్వాత ఆ పదవికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పెదవిని వెంటనే భర్తీ చేయాలి. లేదంటే కాపు ఉద్యమం నాయకుడు లేని ఉద్యమం అయిపోతుంది. 13 జిల్లాల్లో ఉన్న కాపు జేఏసీలు ముదగ్రడ ఎగ్జిట్ తర్వాత ఆ బాధ్యతలకు తగినది ఎవరు? అని అన్వేషిస్తున్నప్పటికీ సరైన నాయకుడు దొరకడం లేదు. ఏపీలో బీసీల తర్వాత మెజార్టీ కాపు వర్గానిదే కాబట్టి కాబోయే నాయకుడు అంతే బలంగా ఉండాలి. అవసరమైనప్పుడు ధర్నాలు చేయాలి..రాస్తారాకోలు చేయాలి. ముద్రగడ పద్మనాభంలా ప్రభుత్వం మీదకు తిరగబడే సత్తా ఉండాలి.
వీటన్నింటిని మంచి కాపు అనే ఓ బ్రాండ్ బలంగా అప్పటికే పడి ఉండాలి. అలా చూసుకుంటే ఆ పదవికి అన్ని విధాలుగా అర్హుడు వంగవీటి రాధ. దశాబ్ధాల క్రితమే ఆంధ్రప్రదేశ్ లో కాపు నాయకుడిగా ఉదయించిన వంగవీటి మోహనరంగ కుమారుడిగా రంగాకు ఆ ఛరిష్మా ఉంది. ఆ సత్తా ఉంది. కాపు అనే బ్రాండ్ రాధను ఓ ఆర్మీలా తయారు చేసింది. వంగవీటి రాధా అంటే తెలియని వారు లేరు. సెలబ్రిటీ వరల్డ్ లోనూ రాధా ఓ బ్రాండ్. రాష్ర్టమంతా వైకాపా వేవ్ కొనసాగుతున్నా సమయంలోనూ బెజవాడ సెంట్రల్ సీటు కోసం అదిష్టానంతో పోరాడి చివరికి తూర్పు సీటు ఇస్తామన్నా కాదని మరి వైకాపాకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసారు.
గెలుపునే వదిలేసి బయటకు వచ్చేసిన దమ్మున్న నాయకుడు రాధ. కానీ తర్వాత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీలో అయితే చేరారు గానీ అందులోనూ యాక్టివ్ గా లేరు. ఆ పై బీజేపీలోనూ…జనసేనలోనూ చేరబోతున్నట్లు ప్రచారం సాగింది గానీ అదీ జరగలేదు. అయితే ఇప్పుడాయనకు కాపు నాయకత్వ బాధ్యతలు చేపడితే బాగుటుంది అన్న ప్రపోజల్ ముందుకొచ్చి నప్పటికీ రాధా అనాసక్తి చూపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన కేవలం విజయవాడ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవ్వాలని భావిస్తున్నారుట.