రెండోసారి కూడా బాగా రాబట్టిన “వకీల్ సాబ్”.!

Vakeel Saab Second Time Also Got Solid Response | Telugu Rajyam

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దాదాపు మూడున్నర ఏళ్ళు తర్వాత మళ్ళీ వెండితెరపైకి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన చిత్రం “వకీల్ సాబ్”. మాస్ గాడ్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం పవన్ కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా వెండితెరపై ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో అలాగే బుల్లితెర పై కూడా మొట్టమొదటి టెలికాస్ట్ లో 19.12 టి ఆర్ పి రేటింగ్ రాబట్టగా మళ్లీ సినిమా రెండో సారి టెలికాస్ట్ కి వచ్చింది.

మరి ఈసారి కూడా వకీల్ సాబ్ గట్టిగానే రాబట్టినట్టు తెలుస్తోంది. ఈసారి ఈ చిత్రానికి 8.43 రేటింగ్ వచ్చింది. ఇది మిగతా కొన్ని హిట్ సినిమాల కంటే బెటర్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో నివేత్త థామస్, అంజలి, అనన్య నాగళ్ల లు కీలక పాత్రల్లో నటించగా శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే థమన్ సంగీతం ఇచ్చిన ఈ సినిమాని పవన్ ఫ్యాన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం వహించారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles