వకీల్ సాబ్’ బృందంలో కరోనా కలకలం

Vakeel Saab actress Anjali tests positive for Covid 19
Vakeel Saab actress Anjali tests positive for Covid 19
పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ రేపే విడుదలకానున్న సంగతి తెలిసిందే.  భారీ అంచనాల నడుమ సినిమా వస్తోంది.  అభిమానులంతా సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమా బృందంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది.  ఇప్పటికే సినిమాలో నటించిన ముఖ్యమైన నటి నివేత థామస్ కరోనాకు గురైంది. అందుకే ఆమె సినిమా ప్రీరిలీజ్ వేడుకకు కూడా హాజరుకలేదు. ఇక ఇప్పుడు మరొక నటి అంజలికి కరోనా పాజిటివ్ అని తేలింది.  అంజలి, నివేతతో కలిసి సినిమాలో వర్క్ చేసింది.  
 
బహుశా అందుకే ఆమెకు కూడ వైరస్ సోకి ఉండవచ్చు.  కాకపోతే అంజలి ఇటీవల జరిగిన వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకకు హాజరైంది.  ఆ వేడుకకు పవన్, వేణు శ్రీరామ్, దిల్ రాజు, తమన్ సహా దాదాపు సినిమా బృందం మొత్తం అటెండ్ అయింది.  అంజలి దాదాపు అందరితోనూ మింగిల్ అయింది.  ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.  ఆమెను కలసిన అందరూ పరీక్షలు చేయించుకోవడానికి రెడీ అయ్యారు.  వారిలో ఎంతమందికి పాజిటివ్ వస్తుందో చెప్పలేని పరిస్థితి.