Chiranjeevi – Charan: ఆచార్య సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం అదే..వాకాడ అప్పారావు!

Chiranjeevi – Charan: సైరా సినిమా అనంతరం రామ్ చరణ్‌కి, తనకు మధ్య ఎలాంటి విబేధాలు రాలేదని అలా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాకాడ అప్పారావు తెలిపారు. ఇక చిరంజీవి గురించి చెప్పాలంటే ఆయన మామూలు వ్యక్తి కాదని, తన కన్నా ముందు నుంచి సినీ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వ్యక్తి అన్న ఆయన, మనుషుల్ని చూసి ఎందుకొచ్చారో చెప్తారని ఆయన తెలిపారు.

ఇక సినిమా గురించి ఆయనకు అన్నీ తెలుసని అప్పారావు అన్నారు. డైరెక్టర్లకు మంచి విలువ ఇస్తాడని ఆయన చెప్పుకొచ్చారు. తాను సినిమా చేస్తున్నపుడు ఆ కాంపౌండ్‌లో మొత్తం డైరెక్టర్‌ చెప్పినట్టుగానే జరగాలని, ఆయన్నే అన్నీ చెప్పమనేవారని వాకాడ చెప్పారు. చరణ్ గానీ, మెగాస్టార్ గానీ ఎప్పుడూ ఇతరులకు మంచి చేయాలనే చూస్తారు తప్ప ఎవరికీ హాని తలపెట్టరు అని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే తాను ఆచార్య సినిమాలో కూడా ఒక వారం రోజులు కలిసి ఉన్నానన్న వాకాడ, ఆయనకు చరణ్ కు మధ్య మంచి సంబంధం ఉందని ఆయన తెలిపారు. కొణిదెల అంటే తన కంపెనీ అని, ఆచార్య సినిమా చాలా పెద్ద ప్రాజెక్ట. దానికి చాలా టైం పడుతుంది. కాబట్టి, లూసిఫర్ సినిమా కోసం బయటికి వచ్చానని ఆయన వివరించారు. ఎప్పుడూ కూడా చిరంజీవి తనపై చాలా అభిమానంతో ఉన్నారని, తనతో 38ఏళ్ల నుంచి తనకు ఆయన పరిచయం ఉన్నారని, ఆయన్ను చూసి తాను చాలా నేర్చుకున్నానని అప్పారావు తెలిపారు. ఆయన ఎప్పుడు చూసినా ఆప్యాయతా, అనురాగంతోనే ఉంటారన్న అప్పారావు, అలాగే చరణ్ గారు కూడా ఉంటారని అసలు వారికి ఎవరి మీదా కోపం రాదని, చాలా సౌమ‌్యులు అని కూడా ఆయన స్పష్టం చేశారు.