వింటేజ్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన చిత్రం ఉప్పెన. డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 50 కోట్ల వసూళ్ళు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. లాక్‌డౌన్ తర్వాత ఓ డెబ్యూ హీరో చిత్రానికి ఇంత భారీగా వసూళ్లు రావడం ఇండస్ట్రీ ప్రముఖులని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర దర్శకుడితో పాటు నాయకానాయికలు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ పలు ప్రాంతాలలో సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు.
ఉప్పెన సక్సెస్‌తో హీరో వైష్ఱవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి ,దర్శకుడు బుచ్చిబాబులకు ఆఫర్స్ ఉప్పెనలా వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు వారు తమ రెమ్యునరేషన్‌ను భారీగా పెంచారనే టాక్స్ వినిపిస్తున్నాయి. కృతి శెట్టి ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ చిత్రంతో పాటు సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ స్టోరీ చిత్రాలు చేస్తుండగా, వీటికి 20 లక్షల రూపాయల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక రానున్న చిత్రాలకు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని కూర్చుందట కృతి.
ఇక వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే మనోడు తొలి సినిమాకు 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. క్రిష్ చిత్రానికి 80 లక్షల పారితోషికం తీసుకున్నాడని టాక్. రానున్న చిత్రాల కోసం 3 కోట్లు వసూలు చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు కూడా తర్వాతి సినిమాలకు భారీగానే పారితోషికం తీసుకోనున్నాడట. బుచ్చిబాబు తర్వాతి చిత్రాలన్నీ స్టార్ హీరోలతోనే ఉండనున్నాయని ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయని సమాచారం.