Mega Hero: శోభిత ధూళిపాళ్ల ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో వినపడుతున్న పేరు. ఇలా ఈమె పాపులర్ అవ్వడానికి కారణం నటుడు నాగచైతన్యను తిరిగి పెళ్లి చేసుకోవడమే అని తెలుస్తుంది. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ప్రేమలో పడ్డారు ప్రేమ గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ఈమె మాత్రం బయట పెట్టలేదు.
అయితే ఉన్నపలంగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకున్నారు. ఇలా వీరిద్దరీ నిశ్చితార్థ సమయం నుంచి శోభిత పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ వచ్చారు.. ఇక శోభిత సమంత చేసిన తప్పు చేయదని ఈమె సినిమాలకు దూరంగా కేవలం ఇంటి పక్కనే వ్యాపారాలు చూసుకుంటూ ఉంటారని అందరూ భావించారు.
ఇక శోభిత మాత్రం సినిమాలను వదిలే ప్రసక్తే లేదు అంటూ ఇటీవల తన కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు అంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఒక పెద్ద ఇంటికి చెందిన కోడలు మరో పెద్దింటి హీరోతో కలిసి నటించడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇకపోతే శోభిత వరుణ్ తేజ్ తో నటించడం ఏమాత్రం తప్పులేదని మరికొందరు భావిస్తున్నారు గతంలో సమంత నాగచైతన్య వివాహమైన తరువాత సమంత రామ్ చరణ్ ఇద్దరి జోడిగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటించిన విషయం తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇలా అప్పుడు సమంత మెగా హీరోతో నటించగా ఇప్పుడు శోభిత కూడా మెగా హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.