Sai Dharam tej: మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన పోలీసులు… ఇది అసలు ఊహించలేదుగా?

Sai Dharam tej: మెగా మేనల్లుడుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో నటుడు సాయిధరమ్ తేజ్ ఒకరు. మెగా కుటుంబం నుంచి హీరోగా పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న సాయి ధరంతేజ్ అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఈయన పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ మంచి మనసును చాటుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పోలీసుల నుంచి సాయి ధరంతేజ్ కు ఊహించని షాక్ ఎదురైంది. అయితే తన సినిమా విషయంలో పోలీసులు తనకు నోటీసులు పంపించారని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు ముందు ఆయన సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక ఈ సినిమా నుంచి సాయి తేజ్ కి సంబంధించిన లుక్ కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమాపై మెగా అభిమానులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు ఈ సినిమాపై సందేహాలు వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోని డైరెక్టర్ సంపత్ నంది గాంజా శంకర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాకు టైటిల్ మార్చాలి అంటూ పోలీసులు సాయిధరమ్ కు నోటీసులు పంపినట్లు తెలిపారు. కేవలం హీరో సాయి తేజ్ కి మాత్రమే కాకుండా నిర్మాత నాగ వంశీ అలాగే నాకు కూడా నోటీసులు పంపించారని తెలిపారు.

సినిమాకు టైటిల్ మార్చమని పోలీసులు తెలియజేశారు అయితే కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత కథ ఆధారంగా టైటిల్ ఫిక్స్ చేస్తాము ఇప్పుడు టైటిల్ మార్చాలి అంటే సినిమా కథ మొత్తం మార్చాల్సి ఉంటుంది అందుకే అంత రిస్క్ చేయలేక సినిమాని పూర్తిగా పక్కన పెట్టేశామని సంపత్ నంది ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.