శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజక వర్గం వైకాపా ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త, విశ్రాంత ఐఎఫ్ ఎస్ అధికారి రెడ్డి నాగభూషణరావు అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం విషమించడంతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. అలాగే మంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. కొన్ని రోజులుగా ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునే వాడిని. ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు కొన్ని సార్లు చెప్పారు.
కానీ ఇంతలోనే ఆరోగ్య విషమించి చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన సేవలు ఎంతో గొప్పవని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కృష్ణదాస్ తెలిపారు. ఇంకా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాంతిరెడ్డి రాజకీయ శ్రేయోభిలాషులంతా సంతాపం ప్రకటించారు. నాగభూషణరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగభూషణం 1985 బ్యాచ్ కి చెందిన ఐఎఫ్ ఎస్ అధికారి. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసారు. కేంద్ర మంత్రిత్వ శాఖలోని విపత్తు నిర్వహణ విభాగంలో డైరెక్టర్ గా పని చేసారు. డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలి కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా పనిచేసారు. గోవా అటవీ శాఖలో డిప్యూటీ కన్జర్వేటర్ గా పని చేసారు. 2019 లో స్వచ్ఛంద పదివీ విరమణ చేసారు. శాంతి-నాగభూషణరావు దంపతులకు నలుగురు సంతానం. కుమార్తె వేదిత రెడ్డి ఢిల్లీలో ఐఏయస్ అధికారిగా పనిచేస్తున్నారు.