వైకాపా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలు..విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. అధికారుల తప్పిదాల కారణంగా ప్రభుత్వం భంగపడాల్సిన సన్నివేశం. వైకాపా కార్యకర్తలు చేస్తోన్న పనులకి ప్రభుత్వానికి సంకటంగా మారింది. అటు వరుసగా హైకోర్టు తో మొట్టికాయలు వేయించుకోవడం పరిపాటిగా మారింది. పార్టీ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వేయడంలోనూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మండిపడింది. డాక్టర్ సుధాకర్, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం, నాయకమ్మ, మూడు రాజధానుల అంశం, ప్రభుత్వ భూములు అమ్మకం ఇలా ప్రతీ అంశంపైనా హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురవ్వడం తప్పడం లేదు.
అటు పార్టీలో అసమ్మతి సెగలు రేగడం…సీఎం జగన్ పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇలా ప్రతీ అంశం ప్రభుత్వానికి ప్రతికూలంగానే ఉంది. తాజాగా వైకాపా పార్టీ నెత్తిన మరో పిడుగు పడింది. ప్రభుత్వ వైద్యురాలినే వైకాపా నేతలు నిర్భందించారంటూ సదరు వైద్యురాలు అనితారాణి ఆరోపించారు. దళిత మహిళ అయిన తనని వైకాపా నేతలు నిర్ధందించి వేధించారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించడం తెలుగు రాష్ర్టల్లో మరో సంచనంగా మారింది. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి రెండు నెలలు అయినా ఇప్పటివరకూ పట్టించుకోలేదని అన్నారు.
విశాఖలో డాక్టర్ సుధాకర్ కు జరిగిన తరహాలోనే అమెకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తుండగా దిగువస్థాయి సిబ్బంది అవినీతిపై ప్రశ్నించినందకు తనపై కక్ష గట్టినట్లు ఆరోపించారు. మార్చి 22న హాస్టల్ గదిలో బంధించి స్థానిక వైకాప నేతల్ని పిలిపించి వాళ్లతో రకరకాల మాటలు అనిపించారన్నారు. అభ్యంతరకంగా ప్రవర్నించారన్నారు. బాత్ రమ్ లోకి వెళ్లినా ఫోటోలో, వీడియోలు తీసారన్నారు. ఆ సాక్ష్యాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్తే అక్కడ రాత్రి వరకూ కర్చోబెట్టి కేసు తీసుకోలేదని, ఈ విషయంలో ఉన్నత అధికారులు కూడా పట్టించుకోలేదని ఆరోపించారు.