విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి ఎలా ఉందంటే..?

దేశ వ్యాప్తంగా సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు, ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా వైర‌స్ బారిని ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప‌లువురు రాజ‌కీయ‌నేత‌లకు క‌రోనా అంటుకుంది. ఈ క్ర‌మంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అవ‌డంతో, ఆయ‌న వెంట‌నే హైద‌రాబాద్‌లోని ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు వారాల పాటు చికిత్స తీసుకున్న విజ‌య‌సాయిరెడ్డి ఇప్పుడు కోలుకున్నార‌ని స‌మాచారం. తాజాగా ఆయ‌న‌కు మ‌రోసారి క‌రోనా టెస్ట్ నిర్వ‌హించ‌గా, నెగిటీవ్ వ‌చ్చింద‌ని విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో త్వ‌ర‌లోనే పొలిటిక‌ల్‌గా యాక్టీవ్ అవ్వాల‌ని ఆయ‌న వ‌ర్గీయులు కోరుకుంటున్నారు.