చంద్రబాబు విజయసాయిరెడ్డి బంధువులా.. బాబుకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఎవరైనా విమర్శలు చేస్తే ధీటుగా స్పందించే విషయంలో విజయసాయిరెడ్డి ముందువరసలో ఉంటారు. తాజాగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. చంద్రబాబు నాయుడుతో తనకు దగ్గరి బంధుత్వం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు ఆయన బంధువుల కంపెనీలను విజయసాయిరెడ్డి కంపెనీలు అని చెప్పడంతో విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు రిలేటివ్స్ కంపెనీలు తనవే అయితే హెరిటేజ్ కంపెనీ కూడా తనకు చెందుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మనవడు తారకరత్న పెళ్లి చేసుకున్న అమ్మాయి తన భార్య సోదరి కూతురు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు తనకు నిజంగా బంధువేనని విజయసాయిరెడ్డి కామెంట్లు చేశారు. చంద్రబాబు వరుసకు నాకు అన్నయ్య అవుతారని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాకు రిలేటివ్ అని అంతమాత్రాన ఆయన బంధువుల ఆస్తులు అన్నీ నావి ఎలా అవుతాయని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బురదజల్లాలనే తపన చంద్రబాబులో ఎక్కువైందని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు చెప్పిన విధంగా అడాన్ కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వ్యాపారాల గురించి నేను మాట్లాడటం లేదని ఆయన తెలిపారు. వైసీపీ విలువలు ఉన్న పార్టీ అని జగన్ ను, తమను విమర్శించడం చంద్రబాబు మానేస్తే తాము కూడా విమర్శించమని విజయసాయి బంపర్ ఆఫర్ ఇచ్చారు. విజయసాయి ఆఫర్ పై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.