Uppena Combo To Repeat : ‘ఉప్పెన’ కాంబో ఇంకోస్సారి: బేబమ్మతో ఆశీ రొమాన్స్ అంతకుమించి.!

Uppena Combo To Repeat : కరోనా ప్యాండమిక్ టైమ్‌లో వచ్చిన సినిమా ‘ఉప్పెన’. ఊరించి ఊరించి ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ఇది. ఊరించినట్లుగానే సినిమా మంచి విజయం అందుకుంది. మెగా చిన్నమేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
అలాగే, కృతిశెట్టి అను అందాల భామ కూడా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది.
బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది తొలి సినిమాతోనే. తొలి సినిమానే అయినా, ‘ఉప్పెన’తో ఈ జంట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా చాలా చాలా ఎక్కువే.
ఈ సినిమాతో కృతిశెట్టి వరుస ఆఫర్లు అందుకుంటూ, అచ్చమైన తెలుగమ్మాయిలా తెలుగునాట పాగా వేసేసింది. రీసెంట‌ుగా ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన కృతిశెట్టి త్వరలో మళ్లీ తన తొలి సినిమా హీరో వైష్ణవ్ తేజ్‌తో జత  కట్టబోతోందట.
ఓ కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడట. ఓ ప్రముఖ బ్యానర్‌లో సినిమా రూపొందబోతోందని అంటున్నారు. ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాలో కృతిశెట్టి మోడ్రన్ లుక్స్‌కి యూత్ ఫిదా అయిపోయారు.
అంతకు మించిన మోడ్రన్ లుక్స్ అండ్ మసాలా యాక్టింగ్‌తో ఈ సినిమాలో కనిపించబోతోందట కృతిశెట్టి. ఓ క్యూట్ రొమాంటిక్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.