లేడీ గెటప్ లో కోపంగా కనిపిస్తున్న ఆ నటుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో అర్జున్ అంబటి కూడా ఒకరు. అర్జున్ అంబటి నటుడిగా బుల్లితెరపై రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు. బిగ్ బాస్ సీజన్ 7లో అర్జున్ వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇతర కంటెస్టెంట్ లకు గట్టి పోటీ ఇచ్చి టాప్ 5 వరకు చేరుకున్నాడు. ఫిజికల్ గేమ్స్ లో అర్జున్ అదరగొట్టాడు.
అతడి కూల్ యాటిట్యూడ్ అందరిని మెప్పించింది. బిగ్ బాస్ సీజన్ 7లో వేదికపైకి ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అతిథిగా వచ్చారు. ప్రస్తుతం బుచ్చిబాబు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఆర్సీ 16 చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రాంచరణ్ కెరీర్ లోనే భారీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.అయితే ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్జున్.. బుచ్చిబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ లో ఒక మంచి పాత్రలో అవకాశం రావాలి అంటే దర్శకులని, నిర్మాతలని ఎన్నిసార్లు అడుక్కున్నా కష్టమే. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. అయినా ఛాన్స్ వస్తుంది అనే గ్యారెంటీ లేదు. కానీ ఉప్పెన లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు స్వయంగా బిగ్ బాస్ షోలో ఆఫర్ ఇచ్చారు. బుచ్చిబాబు అన్నకి జీవితాంతం రుణపడి ఉంటా అని తెలిపారు.
అంతా ఓకే కానీ పై ఫోటోలో వ్యక్తికి, ఈ ఉపోద్ఘాతానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా లేడీ గెటప్ లో కోపంగా కనిపిస్తున్న ఆ నటుడి కి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా.. పై ఫోటోలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు, నటుడు అర్జున్ అంబటి ఫోటో అది. అర్ధనారి సినిమాలో స్టిల్ అది ఈ సినిమాలో ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు అర్జున్ అంబటి అయితే అనుకున్నంతగా ఆ సినిమా సక్సెస్ కాలేదు.