Upaasana: అరుదైన గుర్తింపు దక్కించుకున్న మెగా కోడలు..!

Upaasana: అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా, మెగా కోడలిగా అన్ని వ్యవహారాలను ను ఎంతో సక్రమంగా నిర్వహిస్తున్న ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసనకు యూఏఈ ప్రభుత్వం ఉపాసనకు గోల్డెన్ వీసా అందించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇండియా ఎక్స్‌పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనుకుంటా ఈ క్రిస్మస్‌కు తణుకు అరుదైన బహుమతి లభించిందని,వసుధైక కుటుంబం’.. ప్రపంచమంతా ఒకే కుటుంబం. యూఏఈ గోల్డెన్‌ వీసా అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఈమె వెల్లడించారు. అన్ని దేశాల పట్ల ఎంతో గౌరవం ప్రేమ కలిగిన భారతీయురాలిగా నేను అధికారికంగా గ్లోబల్‌ సిటిజన్‌ అంటూ తన గోల్డెన్ వీసా చూపిస్తూ ఉన్నటువంటి ఫోటో షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు.

అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటి దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనే విషయానికి వస్తే…యూఏఈలో ఉద్యోగం, వ్యాపారం, చదువు కోసం వెళ్లేవారికి అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాకాకుండా ఈ గోల్డెన్ వీసా ఉంటే కనుక మనకు అక్కడ ఏ విధమైనటువంటి నేషనల్ స్పాన్సర్స్ లేకుండానే యూఏఈలో ఉండవచ్చు. ఇప్పటికే మన దేశానికి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలకు ఈ గోల్డెన్ వీసా లభించింది. అలాంటి వారి జాబితాలోకి మెగా కోడలు కూడా చేరింది.