హాలీవుడ్ లోకి “ఆదిపురుష్”..?ఊహించని అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

ఇప్పుడిప్పుడే మన ఇండియన్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ తో అదరగొడుతుండగా ఇప్పుడు పలు సినిమాలు అయితే డైరెక్ట్ గా హాలీవుడ్ రిలీజ్ కి కూడా సిద్ధం అవుతున్నాయి. అయితే ఇంగ్లీష్ రిలీజ్ అంటూ కూడా కొన్ని అయ్యాయి కానీ ఇండియన్ సినిమా ఇది అని గర్వంగా చెప్పుకునే స్థాయి సినిమాలు అయితే మన నుంచి లేవు.
కానీ ఫస్ట్ టైం ఆ హైప్ ని తీసుకొచ్చిన హీరో ఎవరు అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత తనకు వచ్చిన ఫేమ్ తో సరిహద్దులు దాటిన ప్రభాస్ క్రేజ్ తో యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. కానీ ఇప్పుడు దానికన్నా ముందే ఇంకో భారీ చిత్రం “ఆదిపురుష్” తో హాలీవుడ్ ఎంట్రీ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు.
తాజాగా సినీ నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఇప్పుడు హొల్లూవుడ్ లో కూడా రిలీజ్ చేస్తున్నామని ఇంగ్లీష్ లో డబ్బింగ్ చేసి మరో లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఆల్రెడీ పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో మాట్లాడుతున్నామని ఊహించని అప్డేట్ ఇచ్చారు.
మరి ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కగా ప్రభాస్ రాముడిగా నటించాడు లాహి హీరోయిన్ కృతి సనన్ జానకి దేవిగా నటించింది. అలాగే సైఫ్ ఆలీ ఖాన్ రావణ్ పాత్రలో నటించాడు. అలాగే ఈ సినిమాని 3డి లో వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేస్తుండగా 500 కోట్లతో సినిమా నిర్మాణం వహించారు.