జగన్ సర్కార్ ఏడాది పాలనపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోన్న సర్కార్ ఏడాది ఆరంభంలో తప్పటడుగులు పడినా తర్వాత వాటన్నింటిని చక్కదిద్దుకుంటూ వచ్చింది. జగన్ పాలన ఇతర రాష్ర్టాలకే ఆదర్శమని కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది. కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వంగా కీర్తింపబడుతోంది. ఇక షరా మామూలుగా చంద్రబాబు నాయడు అండ్ కో ప్రభుత్వం పనితీరుపై ఏడాది విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ వస్తూనే ఉంది. ఆయనకు తోడుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విమర్శనా గళాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేసారు.
తాజాగా ఏపార్టీలో లేని సీనియర్ నేత, సమకాలిన రాజకీయాలను విశ్లేషించే ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ సర్కార్ పై సంచలన విమర్శలు గుప్పించారు. కరోనాని కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ అధికారులే ప్రభుత్వం పెట్టిన రూల్స్ పాటించడం లేదన్నారు. వాళ్లే పాటించనప్పుడు సామాన్య జనం ఎందుకు? పాటిస్తారని తనదైన శైలిలో విమర్శించారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై పోస్టుల పెట్టడం అన్నది సిగ్గుమాలిన చర్య అని ఆక్షేపించారు. అలాగే మద్యo నిషేధంలో భాగంగా జగన్ సర్కార్ లాక్ డౌన్ సమయంలో లిక్కర్ ధరలు చుక్కలు చూపించిన నేపథ్యంలో ఆచర్యను తప్పుబట్టారు. మధ్యం ధరలు పెంచితే మందు తాగడం మానేస్తారా? అని మండిపడ్డారు.
అదంతా భ్రమ అని అన్నారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి నిమ్మగడ్డపై మాట్లాడిన చర్యను తప్పుగా భావించారు. పాలకులకు కనిపించాల్సింది ప్రజలకు కానీ, ప్రత్యర్ధులు కాదన్నారు. అధికారంలోకి వచ్చింది పాలించడానికా? పగతీర్చుకోవడానికా? అని ప్రశ్నించారు. ప్రజలకు 80,500 కోట్లు పంచుతామంటున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ నుంచి తెస్తారన్నారన్నారు. ఏం చేసినా చూస్తూ ఊరుకోవ డానికి ఎల్వీ సుబ్రమణ్యం కాదు, అక్కడుంది నిమ్మగడ్డ, ఏబీ వెంకటేశ్వరరావు అంటూ తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉండవల్లి వ్యాఖ్యలిప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.