Umadevi: దిగు దిగు దిగునాగ అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయిన కార్తీకదీపం భాగ్యం..!

Umadevi: బిగ్ బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుని ఈ కార్యక్రమాన్ని ముగిసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహకులు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లను కూడా ఆహ్వానించడంతో కంటెస్టెంట్ లు అందరూ వేదిక పైకి వచ్చారు. ఈ క్రమంలోనే నాగార్జున అమ్మాయిలతో కలిసి అద్భుతమైన డాన్స్ ద్వారా వేదిక పైకి వచ్చారు.
అనంతరం ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో పాటకు డాన్స్ చేస్తూ వేదిక పైకి వచ్చారు.

ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న భాగ్యం అలియాస్ ఉమాదేవి వేదికపైకి దిగు దిగు దిగునాగ అనే పాటకు డాన్స్ వేశారు. ఈ పాటలో ఉమా దేవి వేసిన స్టెప్పులకు బిగ్ బాస్ స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయిందని చెప్పాలి ఉమాదేవి అద్భుతమైన స్టెప్పులతో ఒక ఊపడంతో బిగ్ బాస్ కార్యక్రమం మొత్తం ఎంతో సందడి వాతావరణం నెలకొంది .ఇక ఈ పాటతో స్టేజ్ పై దుమ్ములేపిన భాగ్యం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండవ వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లింది.

ఉమాదేవి తరువాత మోడల్ జస్వంత్ వేదిక పైకి వచ్చారు.ఈయన ఒక వైపు శ్వేత వర్మ మరొక వైపు ప్రియాంకతో కలిసి చిన్నదో వైపు పెద్దదో వైపు అనే పాట తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ల తో గ్రాండ్ ఫినాలే ఎంతో అంగరంగ వైభవంగా ముగిసిందని చెప్పవచ్చు.ఇక ఈ కార్యక్రమంలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉన్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ రన్నర్ గా నిలబడగా, సన్నీ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.