VJ Sunny: బిగ్‌బాస్ సీజన్-5 ముగిసినా కూడా.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎవరికి వారు.. సొంత యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకొని.. అందులో వీడియోలను పోస్టు చేసుకుంటూ.. తమ సోషల్ మీడియాలో తమ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఇక సీజన్ విజేతగా నలిచిన సన్నీ అయితే.. చెప్పాల్సిన అవసరం లేదు. తమ ఫ్యాన్స్ ను విపరీతంగా పెంచుకున్నాడు. తన ఆట తీరు.. స్నేహితులకు ఇచ్చే విలువతో అతడిని చాలామంది ఇష్టపడ్డారు. దాంతోనే అతడికి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. ఇలా అతడు ఒక్క తెలంగాణలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు.
ఎంతో పాపులారిటీని సాధించాడు. అతడు బ్యాచ్ లర్ కావడంతో అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో పాటే.. పెళ్లికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. ఇక తాజాగా అతడికి ఓ ఎన్నారై మహిళ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. అమెరికా నుంచి ఓ మహిళ అతడితో వీడియో కాల్ మాట్లాడింది. దీనిలో ఆమె మాట్లాడుతూ.. తన కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అంటూ అడిగింది. అంతే కాదు.. కట్నం కింద రూ.100 కోట్లు కూడా ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చింది.
ఇక దీనికి సన్నీ ఎమని సమాధానం ఇచ్చాడంటే.. తనను భరించాలంటే.. ఎంతో ఓర్పు ఉండాలని.. చాలా సహనం ఉండాలన్నారు. అయినా మీరు ఆ మాట అన్నారు అదే చాలు అంటూ సన్నీ సమాధానం ఇచ్చాడు. తార్వాత ఆమె మరల కల్పించుకొని.. తాను సీరియస్ గా అడుగుతున్నాను అంటూ చెప్పింది. ఇలా ఆమె సన్నీతో లైవ్ లోనే పెళ్లి సంబంధం గురించి మాట్లాడేసింది. ఇలా ఎన్నారై సంబంధంకు సంబంధించి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సన్నీ పెళ్లి కొడుకు కాబోతున్నాడంటూ.. వార్తలు గుప్పుమంటున్నాయి.