ఎస్ ఈసీ పదవి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య తలెత్తిన వివాదం గురించి తెలిసిందే. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలను రద్దు చేయడంపై సీరియస్ అయిన ప్రభుత్వం అటుపై ఆయన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి తప్పించడం…ఆయన స్థానంలో కనగరాజ్ ని నియమించడం వంటి అంశాలు హైకోర్టు…సుప్రీంకోర్టు అంటూ నిమ్మగడ్డ..ప్రభుత్వం ఎలా పోరాటం చేసిందే తెలిసిందే. తొలి నుంచి నిమ్మగడ్డకు అనుకూలంగానే హైకోర్టు తీర్పులున్నా…వాటిని ప్రభుత్వం అమలు చేయకుండా సుప్రీంలో పోరాంటం చేసింది. అక్కడా ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. అంతకు ముందే గవర్నర్ భిశ్వబూషణ్ హరిచందన్ ఆదేశాల మేరకు నియమించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసారు.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ నిమ్మగడ్డని నియమించే విషయంలో తాత్సానం చేసింది. చివరికి సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేడయంతో చివరికి దిగిరాక తప్పలేదు. ఇలా ప్రభుత్వానికి-నిమ్మగడ్డకు జరిగిన నువ్వా? నేనా? అన్న పోరులో చివరికి నిమ్మగడ్డే విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మళ్లీ పునర్నియ మించారు. ఈ మేరకు గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ పేరిట గురువారం రాత్రి పంచాయతీ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేసారు. హైకోర్టు ఆదేశాల మేరకు రమేష్ కుమార్ ని తిరిగి నియమిస్తున్నట్లు తాజా నొటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దీంతో గత ఆరు నెలలుగా నెలకొన్ని వివాదానికి, ఉత్కంఠకు తెరపడింది. రమేష్ కుమార్ పునర్నియాకమకంతో, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై కార్యచరణ కు అవకాశం కల్గినట్లు అయింది. ఇక ఈ విషయంలో ప్రభుత్వం ఇక్కడితో వదిలేసే అవకాశమే కనిపిస్తున్నంది. నిమ్మగడ్డ పదివి కూడా ఎన్నాళ్లో లేదు. వచ్చే మార్చి నెలతో ఆయన పదవి విరమణ పొందుతున్నారు. ప్రస్తుతం ఎలాగూ కరోనా విజృంభణ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. నిమ్మగడ్డ దిగిపోయిన తర్వాత సర్కార్ స్థానిక ఎన్నికలకు సిద్దమయ్యే అవకాశం కనిపిస్తుంది.