బ్రేకింగ్ : ఫైజర్ వ్యాక్సిన్ కి గ్రీన్ సిగ్నల్ .. వచ్చే వారం మార్కెట్లోకి

కరోనా వైరస్ , కరోనా వైరస్ గత కొన్ని రోజులుగా ప్రపంచంలో ఎటు చూసినా, ఎటు విన్నా ఈ పేరే. ప్రపంచ దేశాలను వణికిస్తూ, ప్రజల స్వేచ్ఛ జీవితాన్ని కబళించేస్తూ విలయతాండవం చేస్తుంది. అయితే ఈ మహమ్మారి కరోనా వైరస్ జోరుకు బ్రేకులు వేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయి.

వ్యాక్సిన్ వస్తే తప్ప కరోనా అంతమయ్యేలా కనిపించక పోవడంతో వైద్య నిపుణులు అహర్నిశలు కృషిచేసి.. తమ క్లినికల్ ట్రయల్స్ మరింత వేగవంతం చేసి వ్యాక్సిన్ ను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ భారత్ చేరుకోగా.. అటు జర్మన్ కంపెనీ బయోఎన్టెక్ తో భాగస్వామ్యంలో అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలలోనూ 95 శాతం సత్ఫలితాలను ఇచ్చినట్లు ఫైజర్ ప్రకటించింది.

ఇకపోతే ,జర్మన్‌ కంపెనీ బయోఎన్‌ టెక్ తో రూపొందించిన వ్యాక్సిన్‌ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించమంటూ ఇటీవల యూఎస్‌ఎఫ్‌డీఏ, యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థలకు ఫైజర్‌ దరఖాస్తు చేసుకుంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల స్వతంత్ర నియంత్రణ సంస్థ ఓకే చెప్పడంతో యూకే ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది, దీంతో వచ్చే వారం నుంచి యూకేలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతుంది.

దీనితో ప్రపంచంలో తొలిసారి వ్యాక్సిన్‌ అధికారిక వినియోగానికి అనుమతించిన దేశంగా యూకే నిలవబోతుంది. అలాగే, కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను అందించిన తొలి కంపెనీలుగా ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ లు నిలవనున్నాయి. అత్యవసర ప్రాతిపదికన తమ వ్యాక్సిన్‌ వినియోగానికి యూకే ప్రభుత్వం అనుమతించడం కంపెనీ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టమని ఫైజర్‌ సీఈవో తెలిపారు. అయితే , ఫైజర్ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ కు సూపర్-కోల్డ్ స్టోరేజ్ అవసరం ఉంది