‘చిత్రం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా ఉదయ్ కిరణ్, ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ సినిమాలతో స్టార్ హీరో గా మారిపోయాడు. ఆ టైం లో ఉదయ్ కిరణ్ కి మహేష్ బాబు, ఎన్టీఆర్ కంటే క్రేజ్ ఎక్కువగా ఉండేది. తెలుగు లో నెక్స్ట్ పెద్ద సూపర్ స్టార్ అవుతాడు అనుకున్న టైం లో అనుకోని సంఘటనలు అతడి జీవితాన్ని తలకిందులు చేశాయి.
చిరంజీవి కూతురు తో ఎంగేజ్మెంట్ కాన్సుల్ అయ్యాక ఉదయ్ కిరణ్ కెరీర్ ఒక్కసారిగా దెబ్బ తిన్నది. దీనికి కారణం చిరంజీవి అనే అనుమానాలు కూడా వచ్చాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే…ఆ సంఘటన తర్వాత ఏకంగా ఉదయ్ కిరణ్ వి దాదాపు పది సినిమాలు ఆగిపోయాయి.
ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..స్టార్ డైరెక్టర్ ఎఎం రత్నం నిర్మాణంలో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తరవాత ప్రేమంటే సులువుకాదురా సినిమా ప్రారంభమైంది. 80శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఉదయ్ కిరణ్ హీరోగా ఆదిశంకరాచార్య సినిమాను అనుకున్నారు.
భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించాలని అనుకోగా నిర్మాత ఆర్థిక సమస్యలు..ఉదయ్ కిరణ్ గ్రాఫ్ పడిపోవడం లాంటి కారణాలతో మధ్యలోనే ఈ సినిమా ఆగిపోయింది. పూరి జగన్నాత్ దర్శకత్వంలో ఆసిన్ హీరోయిన్ గా ఉదయ్ కిరణ్ హీరోగా ఓ సినిమా అనుకున్నారు. ఈ సినిమాను కూడా మధ్యలోనే ఆపేశారు. బాలయ్య దర్శకత్వంతో పాటూ ప్రధాన పాత్రలో నటించిన నర్తనశాల సినిమాలో ఉదయ్ కిరణ్ ను అభిమన్యుడి పాత్రకు ఎంపికచేశారు. ఈ సినిమా సౌందర్య మరణించడంతో మధ్యలోనే ఆపేశారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన జబ్ వి మెట్ సినిమాను తెలుగులో ఉదయ్ కిరణ్ త్రిష జంటగా తెరకెక్కించాలని అనుకున్నారు.
ఈ సినిమా కూడా ఆగిపోయింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణసంస్థ ఉదయ్ కిరణ్ సదా జంటగా ఓ సినిమాను ప్లాన్ చేయగా ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఎమ్మెస్ రాజు నిర్మాణంలో ఉదయ్ కిరణ్ హీరోగా ఓ సినిమా అనుకున్నారు. ఆ సినిమా కు కూడా బ్రేక్ పడింది. అంతే కాకుండా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా ఓ ప్రేమకథను అనుకున్నారు. ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు. ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు చేసిన తేజ మరో సినిమా చేయాలని కూడా అనుకున్నాడు. కానీ అది పట్టాలెక్కలేదు. ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్ పై ఉదయ్ కిరణ్ అంకిత జంటగా ఓ సినిమా అనుకున్నారు. ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.
తెలుగు లో కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో ఉదయ్ కిరణ్ తమిళ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అక్కడ కూడా తనకు కలిసి రాలేదు. ఒకప్పుడు స్టార్ హీరో గా ఒక్క వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్, కెరీర్ సరిగ్గా లేకపోవడంతో…తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకున్నాడు.