తొలి మూవీ “చిత్రం”తో హిట్ సాధించి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి లవర్ బాయ్ ఇమేజ్ సాధించి యువ కెరటంలా దూసుకుపోయాడు ‘ఉదయ్ కిరణ్’. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఉదయ్ సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగాడు. అప్పట్లో ఉదయ్ కి ఉన్న లేడీ ఫాలోయింగ్ మరో కుర్ర హీరోకి లేదు. ఆ తర్వాత వరుస పరాజయాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక వత్తిడిని తట్టుకోలేక 37 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా దూరమైయ్యాడు.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అందరిని కలిచివేసింది. ఇప్పటికి ఉదయ్ ని అభిమానించే అభిమానులు ఎందరో ఉన్నారు. వారందరికీ ఒక శుభవార్త… ఉదయ్ కిరణ్ వెండితెర మీద మరోసారి చూడాలని కోరుకునే అభిమానుల కలలు తొందర్లోనే తీరిపోతున్నాయి. ఉదయ్ కిరణ్ చివరగా నటించిన చిత్రం “చిత్రం చెప్పిన కథ” ఎట్టకేలకు ఇప్పటికి విడుదలకు సిద్ధమవుతోంది.
2015లోనే విడుదలవ్వాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలతో విడుదలవలేదు. మేకర్స్ ఈ మూవీని పూర్తి చేసి పలు ఒటిటి ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరిపగా అదిరిపోయే రేటు పలికిందట. అతి త్వరలోనే ఏదొక ఆఫర్ ని ఫైనల్ చేసి రిలీజ్ చేసెయ్యాలని మేకర్స్ కూడా భావిస్తున్నారట. ఉదయ్ కిరణ్ చివరి చిత్రం కావటంతో ఈ సినిమా మీద ఆసక్తి, హైప్ ఉంటుందని ఒటిటి ప్లాట్‌ఫామ్స్ లెక్కలేస్తున్నారట. ఈ నెల 26న ఉదయ్ జయంతి సందర్బంగా విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తుంది.