ఉద‌య్ కిర‌ణ్ త‌రుణ్ కాంబోలో మిస్ అయిన మ‌ల్టీ స్టారర్

2000 కాలంలో ఉదయ్ కిరణ్, తరుణ్ ఇద్దరూ సూపర్ హిట్స్ తో దూసుకుపోయారు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరోస్ కి సీనియర్ హీరోస్ కూడా భయపడేవారు. పెద్ద సూపర్ స్టార్స్ అవుతారు అనుకున్న ఇద్దరూ కొన్నాళ్లకే ఫేడ్ అయిపోయారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోగా, తరుణ్ సినిమాలకు గుడ్బై చెప్పేసాడు.

కానీ వీళ్లిద్దరు కాంబినేషన్ లో ఒక మ‌ల్టీ స్టారర్ రావాల్సింది ఆగిపోయిందని చాలా మందికి తెలియదు. ఆ స‌మ‌యంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎంఎస్ రాజు ఇద్ద‌రితో క‌లిసి ఓ మ‌ల్టీ స్టార‌ర్ సినిమాను తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు.

ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు ఉదయ్ కిరణ్, తరుణ్ కాంబినేషన్ లో ‘నీ స్నేహం’ అనే సినిమాను ప్లాన్ చేశారు. అందులో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం తరుణ్ ని అనుకున్నారంట. కానీ తరుణ్ రిజెక్ట్ చెయ్యడంతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేని జ‌తిన్ గ్రేవాన్ ను తీసుకున్నారు.

ఇదే కాకుండా రవి బాబు ‘సోగ్గాడు’ సినిమా కూడా ఉదయ్ కిరణ్, తరుణ్ ని హీరోలుగా పెట్టి తీద్దామనుకున్నాడు, కానీ ఉదయ్ కిరణ్ కాదనడంతో బాలీవుడ్ హీరో తో తీసాడు, ఆ సినిమా ప్లాప్ అయ్యింది.