Actor Tarun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో లవర్ బాయ్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోలలో నటుడు తరుణ్ ఒకరు. ఈయన గతంలో ఎన్నో ప్రేమ కథ సినిమాలలో నటిస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నారు. ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న తరుణ్ గత కొంతకాలంగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలు తెలియకపోయినా తిరిగి ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు.
సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉంటున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఈయన కనిపించడంతో ఇతని ఫోటో చూసినా అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.ఇన్నాళ్లకు మీరిలా కనిపించడం చాలా ఆనందంగా ఉంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “మళ్లీ సినిమాల్లోకి రావాలి” అంటూ కోరుతున్నారు.అయితే తరుణ్ లుక్ కూడా కాస్త అభిమానులని ఆందోళనకి గురి చేసింది.
ఒకప్పుడు చాలా స్మార్ట్ గా కనిపించే తరుణ్ ఇప్పుడు మాత్రం బక్క చిక్కి తెల్లగడ్డంతో రఫ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా, డాన్ లీ ఇప్పటికే తన నటనతో కొరియన్ సినిమాల ద్వారానే కాక, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్నారు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు ఓటీటీలో విడుదల అవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ఈయన ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న స్పిరిట్ సినిమాలో కూడా నటించబోతున్నారని తెలుస్తుంది.
ఇలా స్పిరిట్ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో తరుణ్ ఈయనతో కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ సినిమాలో తరుణ్ కూడా నటించబోతున్నారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి త్వరలో తరుణ్ నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో తెలియాల్సి ఉంది.