Crime: తాజాగా ఖమ్మం, వేములవాడ లో ఇద్దరు యువకులు ఉద్యోగం రాలేదని బలవన్మరణానికి పాల్పడ్డారు. కోదాడకు చెందిన అల్లిక వేణు(22) అనే విద్యార్థి డిగ్రీ పూర్తి చేశాడు. ఇక ఈ నేపథ్యంలోనే తన మిత్రుడికి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చి తనకు రాలేదు అని గత కొద్ది రోజులుగా బాధపడుతున్నాడు. నాలుగు రోజుల కిందట ఖమ్మం వచ్చిన అతను ఒక ప్రైవేట్ వసతి గృహంలో ఉంటున్నాడు. తాజాగా అతడు గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని కాశాయ పల్లి లో గోస్కుల ప్రశాంత్ (23) అనే వ్యక్తి డిగ్రీ పూర్తి చేశాడు. అతని తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. అనంతరం ఆర్మీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ కూడా పొందాడు. అయితే శిక్షణ పూర్తి అయినప్పటికీ ఉద్యోగం రాలేదని మనస్థాపంతో చెందిన ప్రశాంత్ తాజాగా బుధవారం రోజు పొలం వద్దకు వెళ్లి అక్కడ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సిఐ వెంకటేష్ తెలిపారు.