Pushpa 2: మరో వివాదంలో పుష్ప 2….. ఆగ్రహం వ్యక్తం చేసిన టీచరమ్మ…. అసలేం జరిగిందంటే?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఎలాంటి వివాదాలకు కారణమైందో మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత ఈ సినిమాని ఎన్నో వివాదాలు చుట్టుముట్టడమే కాకుండా ఇలా హీరోలు స్మగ్లింగ్ చేసే పాత్రలలో నటిస్తే కనుక ఆ పాత్రలు అభిమానులు ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపుతాయని తద్వారా ఎంతోమంది తప్పుడు మార్గంలో పయనించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈ సినిమా పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

ఇలా నిత్యం ఈ సినిమా ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమా చూసే విద్యార్థులందరూ చెడిపోతున్నారు అంటూ ఒక స్కూల్ హెడ్ మాస్టర్ పుష్ప సినిమాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని యూసఫ్ గూడ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అచ్చం పుష్ప సినిమాలో హీరో హెయిర్ స్టైల్ ఆయన డ్రెస్సింగ్ ఫాలో అవుతూ పాఠశాలకు కూడా అదే విధంగా హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే స్కూల్ హెడ్ మాస్టర్ ఈ విషయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.పుష్ప సినిమా పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తుంది, ఇలా సినిమాని అనుసరించి యువత పాడైపోతే అందుకు బాధ్యులు ఎవరు అంటూ ఈమె ప్రశ్నించారు. ఇలా చిన్న పిల్లలు దేనికైతే ఎక్కువ ప్రభావితం అవుతారో పెద్దయిన తర్వాత కూడా అలాగే ఉంటారు దీంతో టీచర్ పడుతున్న ఆవేదనలో అర్థం ఉందని సినిమాలు చేసేటప్పుడు హీరోలు దర్శకులు ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటూ సమాజానికి మంచి చేసే సినిమాలే చేయాలి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా తెలంగాణలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలరోజే సంధ్య థియేటర్ వద్ద ఓ అభిమాని మరణించడంతో ఏకంగా హీరో అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంలో వివాదాలలో నిలుస్తూనే ఉంది.