ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు చిన్నారుల విషయంలో కొద్దిపాటి ఏమరుపాటుగా ఉన్నా కూడా ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక తల్లి చిన్నారికి స్నానం చేయించాలని వేడి నీళ్లు సిద్ధం చేయగా ఆ వేడి నీటిని ముట్టుకున్నా చిన్నారి ఆ నీరు తనపై పడడంతో నొప్పిని తాళలేక చనిపోయింది. అలాగే ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా కరెంట్ షాక్ వల్ల మరణిస్తున్నారు. చిన్నారులతో పాటు పెద్దలు కూడా విద్యుత్ షాక్ తో ఏమరుపాటుగా ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా ఇంటికి విద్యుత్ తీగలు తగిలి చాలామంది చనిపోయారు.ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.
అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు వాటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో ఒకేసారి రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. కరెంట్ షాక్ కు గురయి తండ్రి, రెండేళ్ల చిన్నారి బలయ్యారు. తల్లి పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉంది. అసలేం జరిగిందంటే..సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురికి విద్యుత్ షాక్ తగలడంతో, ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకవైపు ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది.
అయితే ఇందుకు గల కారణం ఆ ఇంటి పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు బాల్కనీలో ఇరన్ ఉన్న పైపు తగలడంతో ఇళ్లకు షాక్ గురైనట్లు తెలుస్తోంది. ఐరన్ పైపుల పై బట్టలు ఆరబెట్టే సమయంలోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులు ఒడిశాలోని బాజీ పూర్ మండలానికి చెందిన వాసుదేవ మాలిక్ అని గుర్తించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు లతో విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనలో తండ్రితో రెండు ఏళ్ళ కూతురు ఇద్దరు చనిపోయారు .మరొక వైపు తల్లి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.ఆమె పరిస్థితి ప్రస్తుతం విషయంగా ఉంది.