Y S.Jagan: నా ప్రతి అడుగులోను మీరే నాకు స్ఫూర్తి… వైయస్ జగన్ ఎమోషనల్ పోస్ట్!

Y.S.Jagan: నేడు ఫాదర్స్ డే కావడంతో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు అలాగే సాధారణ ప్రజలు కూడా వారి తండ్రులను గుర్తు చేసుకుంటూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసిపి అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

”మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తి, మీరే నాకు రోల్‌ మోడల్‌, నా ప్రతి అడుగులోనూ మీరే నా స్ఫూర్తి. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా” అంటూ వైఎస్సార్‌ ఫోటోను జతచేశారు. చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును కూడా గుర్తు చేసుకుంటున్నా.. అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాలలోకి వచ్చిన విషయం తెలిసిందే.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసే అద్భుతమైన మెజారిటీ సాధించారు అయితే ఈయన ఎంపిగా గెలిచిన తరువాత వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా వైఎస్ఆర్సిపి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కడప నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జగన్ భారీ మెజారిటీతో గెలిచారు. అనంతరం తన పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలపరుస్తూ 2019 ఎన్నికలలో అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకొని ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక 2024 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలు అయిన విషయం తెలిసిందే.