Accident: జూబ్లీహిల్స్ లో బీభత్సం సృష్టించిన కారు.. ప్రమాదంలో రెండు నెలల చిన్నారి మృతి..!

Accident: వాహనాల సంఖ్య పెరగటంతో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ వాహనాన్ని నడిపే వారి నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఒక కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మూడు నెలల చిన్నారి కఠిన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది.

వివరాలలోకి వెళితే… గురువారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో ముగ్గురు మహిళలు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో రోడ్డు దాటుతూ ఉన్న తరుణంలో ఒక కారు వేగంగా వచ్చి మహిళల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా వద్ద ఉన్న రెండు నెలల చిన్నారి కిందపడి తలకు బలంగా గాయమవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ముగ్గురు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ ముగ్గురు మహిళలు యాచకులుగా పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని, గాయపడ్డ మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా ప్రమాద ఘటన జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఆక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా కారు బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటం గమనించారు. ఇప్పుడు ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం గురించి బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందిస్తూ ఈ ప్రమాదానికి తనకు ఎటువంటి సంబంధం లేదని తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నానని వివరించాడు.