Suriya’s et : ట్విట్టర్ రివ్యూ : సూర్య అవైటెడ్ “ఈటి” సినిమా ఎలా ఉందంటే..?

Suriya’s et : కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోస్ లో ఒకరైన సూర్య హీరోగా చాలా కాలం తర్వాత నటించిన పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ “ఈటి”. తమిళ దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి ప్లాన్ చేసి లాస్ట్ లో తెలుగు మరియు హిందీలో మాత్రమే చెప్పుకోదగ్గ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది.
అయితే తెలుగులో “ఎవరికీ తల వంచడు” అని రిలీజ్ అయ్యిన ఈ సినిమా టాక్ అండ్ ట్విట్టర్ రివ్యూస్ తెలుస్తున్నాయి. ఈ చిత్రంపై అభిమానుల వరకు చాలా మేర పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అలాగే తమిళ మీడియా వర్గాలు కూడా ఈటి బాగానే ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా సూర్య మరియు మహిళలపై చూపించిన కాన్సెప్ట్ లు సినిమాలో హైలైట్ కాగా ఎమోషన్స్ బాగా పండాయని తెలుస్తుంది. కానీ జెనరల్ ఆడియెన్స్ విషయం లోకి వస్తే ఈటి కి గట్టి దెబ్బె పడినట్టు తెలుస్తుంది. ఈ సినిమా లో ఓవర్ ఎమోషన్స్ అలాగే పాతకాలపు సినిమా తరహా నరేషన్ లో విసుగు తెప్పించేలా ఉందని అనేస్తున్నారు.
ఇందాక చెప్పినట్టు సూర్య అలాగే ఈ ఫీమేల్ సెంటిమెంట్ లు మినహా మిగతా సినిమా అంతా తేలిపోయింది అంటున్నారు. ఎందుకో ఈ సినిమాపై లాస్ట్ చేసి హైప్ కూడా తగ్గిపోయింది. ఇక ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.