ట్విట్టర్ రివ్యూ : ఈ “ఖుషి” ఖుషీ చేసిందా??

లేటెస్ట్ గా అయితే టాలీవుడ్ సినిమా దగ్గర మంచి అంచనాలు నడుమ అందులోని ఈ సెప్టెంబర్ స్టార్ట్ కావడంతోనే వచ్చిన చిత్రం “ఖుషి”. యంగ్ హీరో విజయ్ దేవరకొండ అలానే సమంత లు హీరోయిన్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించాడు.

కాగా ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా అయితే ఇప్పుడు రిలీజ్ కాగా ఈ సినిమాపై మంచి హైప్ తో వచ్చినప్పటికీ అనుకున్న రేంజ్ లో ఐతే బుకింగ్స్ తెలుగు స్టేట్స్ లో లేవు అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా యావరేజ్ గానే ఉన్నాయి. ఇక యూఎస్ లో మాత్రం మంచి ఓపెనింగ్స్ ని అందుకున్న ఖుషి ప్రీమియర్స్ టాక్ అయితే ఆల్రెడీ సోషల్ మీడియాలో పడిపోయింది.

మెయిన్ గా ట్విట్టర్ లో అయితే ఖుషి రివ్యూస్ వచ్చేసాయి. వీటితో ఈ సినిమా యావరేజ్ లెవెల్లో అనిపిస్తుంది. వర్కౌట్ అయితే ఓకే కానీ సినిమాలో అయితే అంత బలయిన విషయం ఏమీ లేదట. సమంత బాగానే సెట్ అయ్యింది కానీ తన రోల్ కి విజయ్ పూర్తి న్యాయం చేయలేకపోయాడు అంటున్నారు.

ఇంకా సినిమాలో పాటలు కామెడీ, ఎమోషన్స్ బావున్నాయట. బట్ అదే రొటీన్ కథతో శివ నిర్వాణ వచ్చాడు అని అందుకే సినిమా పెద్దగా ఏమీ లేదు అని చాలా మంది అనేస్తున్నారు.  ఖుషి పూర్తి స్థాయిలో ఖుషీ ఫీల్ ఇవ్వలేకపోయింది అనే చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి 60 కోట్ల మేర బిజినెస్ అయ్యినట్టుగా టాక్ ఉంది అంత మొత్తానికి అందుకుంటుందో లేదో చూడాలి మరి.