ట్విట్టర్ రివ్యూ : నితిన్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్” రిపోర్ట్స్ ఎలా ఉన్నట్టు

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న టైర్ 2 హీరోస్ లో అయితే ఇద్దరు హీరోస్ సినిమాలు ఈ వారం లోనే థియేటర్స్ లోకి వచ్చాయి. ముందు నేచురల్ స్టార్ నాని నటించిన “హాయ్ నాన్న” సినిమా రిలీజ్ కి రాగా నెక్స్ట్ అయితే హీరో నితిన్ నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్” కూడా వచ్చింది.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు రచయితా వక్కంతం వంశి తెరకెక్కించగా నితిన్ అన్ని అసలు ఈ సినిమా మీదే పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆల్రెడీ షోస్ యూఎస్ లో కంప్లీట్ చేస్కున్న ఈ చిత్రం రిపోర్ట్స్ ఓ మాదిరిగా ఉన్నాయని చెప్పాలి. నితిన్ ఫ్యాన్స్ నుంచి తప్ప మిగతా వారి నుంచి అంత పాజిటివ్ స్పందన ట్విట్టర్ ప్రేక్షకుల్లో కనిపించడం లేదు.

కాగా చాలా వరకు మిక్స్డ్ రెస్పాన్స్ ఈ చిత్రానికి కనిపిస్తుంది. కామెడీ ఓకే నితిన్ కూడా బాగున్నాడు అలాగే ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుందట. కానీ సినిమాలో ఫ్రెష్ నెస్ ఎక్కడా లేదని కంప్లైంట్. అలాగే శ్రీలీల కూడా అంత ఇంపార్టెంట్ ఏమి కాదని అంటున్నారు. అయితే నటుడు రాజశేఖర్ పై కూడా ఎంజాయ్ చేయొచ్చట.

ఇలా కాస్త అటు ఇటు గానే ట్విట్టర్ జనం ఈ సినిమాకి రివ్యూస్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఆల్రెడీ లాస్ట్ ప్లాప్ తో నితిన్ వెనకపడ్డాడు. దీనితో అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి దీనికేం అవుతుందో చూడాలి.
https://twitter.com/Ojhas_Karam/status/1732960777781522915