“జై భీమ్” నుంచి డిలీట్ చేసిన సూర్య ఫైట్ సీక్వెన్స్ చూసారా?

తమిళ నాట అపారమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో విలక్షణ హీరో సూర్య శివకుమార్ కూడా ఒకడు. మరి సూర్య హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో థియేట్రికల్ గా పెద్ద సక్సెస్ అయితే ఏది లేదు. దీనితో సూర్య నుంచి ఫ్యాన్స్ అంతా ఓ మాసివ్ థియేట్రికల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే సూర్య నటించిన “ఈటి” ఎవరికీ తల వంచడు కి  సినిమాలు తన ఓటిటి నుంచి వచ్చి భారీ హిట్ అయ్యాయి. ఆ చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ కావాల్సింది అని అంతా అనుకున్నారు. కాగా ఆ చిత్రాల్లో దర్శకుడు టిజి జ్ఞ్యానవెల్ తెరకెక్కించిన ఓ హార్డ్ హిట్టింగ్ డ్రామా “జై భీమ్” కోసం అందరికీ తెలిసిందే.

అణగారిన కులాలపై జరిగిన అమానుషాలపై పోరాడిన ఓ లాయర్ కథగా దీనిని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా ఓటిటీలో అప్పుడు భారీ సక్సెస్ అయ్యింది. మరి తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా హిట్ అయ్యిన ఈ సినిమాలో కొత్త సూర్య ని అయితే చాలా మంది చూసారు.

ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో సూర్యపై ఒక్క ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండదు. అయితే తమ హీరోని అలా చూడడం కష్టమే కానీ ఈ సినిమాలో నిజానికి ఓ ఫైట్ సీక్వెన్స్ వైరల్ గా మారింది. సూర్య పై దర్శకుడు జ్ఞ్యానవేల్ ఓ అదిరే ఏక్షన్ ఎపిసోడ్ ని అయితే డిజైన్ చేశారు.

కాగా ఈ సీన్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ్ లో ఈ సినిమాని టెలికాస్ట్ చేయగా అప్పుడు ఓటిటి లో రిలీజ్ చేయని ఫైట్ సీన్ ని ఇప్పుడు యాడ్ చేశారు. దీనితో జై భీమ్ లో సూర్య పై ఫైట్ సీన్ అంటూ ఇది ఇపుడు అందరిలో వైరల్ గా మారింది.