ట్విట్టర్ రివ్యూ : “ప్రిన్స్” శివకార్తికేయన్ తో జాతిరత్నాల డైరెక్టర్ గెలిచాడా?

మళ్ళీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో కొన్ని నోటెడ్ సినిమాలుగా ఈ వారం థియేటర్స్ లో కొన్ని సినిమాలు రిలీజ్ కాగా ఈ చిత్రాల్లో అయితే జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ తమిళ యంగ్ అండ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో తీసిన ఓ యూనిక్ ఎంటర్టైనర్ చిత్రం “ప్రిన్స్”.

మరి టీజర్ తో బాగానే హైప్ అందుకున్న ఈ చిత్రం తమిళ్ సహా తెలుగులో ఈరోజు రిలీజ్ అయ్యింది. కేవలం అనుదీప్ ఎంటర్టైన్మెంట్ పై నమ్మకం శివకార్తికేయన్ తో సినిమా ఎలా ఉంది అనే అంశాలతోనే నమ్మకంగా రిలీజ్ అయ్యిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో క్లియర్ అవుతుంది.

అయితే బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అనుకున్న ఈ ఈ జర్నీ కాస్త మిస్ ఫైర్ అయ్యింది అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. కొంతవరకు సినిమాలో ఎంటర్టైన్మెంట్ పర్లేదు కానీ మొత్తంగా అయితే సినిమా అంత అనుకున్న రేంజ్ లో లేదని తమిళ సినీ వర్గాలు వారు అంటున్నారు.

స్టోరీ సింపుల్ గానే ఉంది కానీ అక్కడక్కడా కామెడీ బాగున్నట్టు అంటున్నారు. మరి కొందరు అయితే శివకారికేయన్ సినిమా మిస్టర్ లోకల్ లా ఉంది అంటున్నారు. మొత్తానికి అయితే కొంచెం యావరేజ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ శివకార్తికేయన్ గత సినిమాలు కూడా ఇలాగే స్టార్ట్ అయ్యాయి. మరి ఈ సినిమాకి ఏమవుతుందో చూడాలి.