మంత్రి అంబటి, మాజీ మంత్రి అయ్యన్న మధ్య ట్వీటు యుద్ధం.! జుగుప్సాకరం.!

Minister Ambati : ఆయన సీనియర్ పొలిటీషియన్.. గతంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇంకొకాయన ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. ఒకరు తెలుగుదేశం పార్టీ నేత, ఇంకొకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇద్దరూ కలిసి ట్విట్టర్ వేదికగా అసభ్యకరమైన మాటల యుద్ధానికి తెరలేపారు.

‘కాంబాబు..’ అంటూ మొదలైన ఈ ట్వీట్ల యుద్ధం, ఎంత నీచ స్థితికి దిగజారిందంటే, ఆడాళ్ళని ఇందులోకి లాగి, వాళ్ళ జీవితాలతో ఆడుకునేదాకా.!
మంత్రి అంబటి కుమార్తెను మాజీ మంత్రి అయ్యన్న వివాదంలోకి లాగారు. ఇంకోపక్క, తెలుగుదేశం పార్టీలో పని చేసిన ఓ మహిళా నేతని ‘పక్కలేయడం’ వివాదంలోకి లాగారు మంత్రి అంబటి రాంబాబు. అయ్యన్న నోటికి హద్దూ అదుపూ వుండదు. అంబటి ఈ విషయంలో తక్కువేమీ కాదు.

ముందు ముందు అంబటి కామ లీలలకు సంబంధించిన వీడియోలూ విడుదలవుతాయ్.. అంటున్నారు అయ్యన్నపాత్రుడు. నిజంగానే, అలాంటివి వున్నాయా.? అని జనం విస్తుపోతున్నారు. రాజకీయాల్లో వుంటే ఏమైనా అంటాం.. అనడం సరికాదు.

స్వర్గీయ ఎన్టీయార్ వ్యవహారంలో పక్కలేసే వ్యవహారం నడిచిందని ‘జయప్రదంగా’ అంటూ ఓ మాజీ టీడీపీ మహిళా నేత పేరుని తెరపైకి అంబటి తీసుకురావడం జుగుప్సాకరం. అలాగే అంబటి కుమార్తెని ఈ వివాదంలోకి లాగడమూ అభ్యంతరకరమే. ఇరు పార్టీల అధినేతలూ తమ నాయకుల్ని అదుపులో పెట్టకపోతే అంతకన్నా దారుణం ఇంకోటుండదు.