టీవీ 5 మూర్తి .. ఇంత గుడ్ న్యూస్ వెనక అంత కథ నడిచిందా!

ప్రభుత్వానికి , ప్రజలకు మధ్య మీడియా ఒక వారధిలా పని చేస్తుంది. మీడియా ద్వారానే ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి.అయితే ఈరోజుల్లో మీడియా స్వేచ్ఛకు రాజకీయ నాయకులు అడుగడునా అడ్డు పడుతున్నారు. వినకపోతే కేసులు పెట్టి జైళ్ల చుట్టూ, కోర్ట్ ల చుట్టూ తిప్పుతున్నారు.

ఇప్పుడు ఏపీలో కూడా మీడియా హక్కును హరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మీడియా కూడా ఈమధ్య రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారుతున్నారు. ఈమధ్య కాలంలో టీవీ5 మూర్తిపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. చానల్ చర్చా కార్యక్రమంలో యూనివర్శిటీల పాలకవర్గాలకు సంబంధించి అన్నీ ఒక్కరెడ్డి సామాజికవర్గానికే అదీ కూడా వైసీపీ నేతల సిఫార్సులతోనే నియమించారన్న ఆధారాలను మూర్తి బయట పెట్టారు. ఈ ఆధారాలను ఆ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శ్రావణ్ కుమార్ అనే న్యాయవాది బయటపెట్టారు. అవి తన కార్యాలయంలో ఉండాల్సిన పత్రాలను చోరీ చేశారని సంబంధిత శాఖ ఉన్నతాధికారితో ప్రభుత్వం కేసు పెట్టించింది. అందులో ఆ శ్రావణ్ కుమార్‌తో పాటు టీవీ5 చైర్మన్, ఆ చర్చ కార్యక్రమాన్ని నిర్వహించిన మూర్తిపైనా కేసులు పెట్టారు.

పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చేలోపు మూర్తి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే పోలీసులు దీన్ని అదునుగా చేసుకొని మూర్తిని వేధించడం ప్రారంభించారు. విచారణకు పిలిచి గంటల కొద్దీ కూర్చోబెట్టి ఏమి అడగకుండా పంపించేవాళ్ళు. ఇలా వారానికి 4 రోజులు పిలిపించి వాళ్ళు. దీంతో విసిగిపోయిన మూర్తి ఇలా విసిగించడం కంటే కూడా తనను ఒక్కసారే చంపేస్తే బాగుంటుందని ఒక వీడియో కూడా విడుదల చేశారు. అయితే విచారణ వేధింపుల విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తూ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఇంకా విచారణ జరపాల్సిన అవసరం ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని ఆదేశించింది. ఇది మూర్తిగా భారీ రిలీఫ్ ఇచ్చింది.