టీటీడీ నిధులు : జగన్ గారు తప్పు చేస్తున్నారయ్యా

jagan tirumala

 తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు పవిత్రంగా భావించే సన్నిధానం. అక్కడ జరిగే ప్రతి విషయంపై హిందువుల మనోభావాలు ఆధారపడి ఉంటాయి. జగన్ ముఖ్యమంత్రి అయినా నాటి నుండి తిరుమల అనేక సార్లు వార్తలకెక్కింది . ఏ చిన్న పొరపాటు జరిగిన దానిని బూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ తిరుమల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేయ్యాలి, కానీ ఇప్పుడు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయం అనేక విమర్శలకు దారితీసే అవకాశం వుంది.

tirumala tirupati telugu rajyam

 

 ఎప్పటినుండో వెంకన్న మిగులు నిధులు బ్యాంకు లో డిపాజిట్ చేసి, వాటిమీద వచ్చే వడ్డితోనే అనేక కార్యక్రమాలు నడిపిస్తుంటారు. అయితే బ్యాంక్ లు వడ్డీరేట్లు తగ్గించాయి కాబ్బట్టి అనుకున్న స్థాయిలో ఆదాయం రావటం లేదు. దీనితో ఆ నిధులను రాష్ట్ర సెక్యూరిటీల తరుపున డిపాజిట్ చేయాలని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా చేయటం వలన ఎక్కువ వడ్డీ వస్తుందని చెపుతున్నారు. అయితే ఇందులో అనేక సమస్యలు వున్నాయి. బ్యాంకు లో డిపాజిట్ లు చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు నిధులు వెనక్కి తీసుకోవచ్చు, కానీ రాష్ట్ర సెక్యూరిటీ లో డిపాజిట్ చేస్తే దానికి ఒక కాలపరిమితి ఉంటుంది. లాంగ్ టర్మ్ లోనే డిపాజిట్లు చేయాలి, టర్మ్ అయినా తర్వాతే వాటిని తీసుకోవటానికి వీలు ఉంటుంది. నెల నెల వడ్డీలు కూడా రావు. బ్యాంకులో మాత్రం ప్రతి నెల వడ్డీ తీసుకోవచ్చు.

  పైగా ఒక్కసారి రాష్ట్ర సెక్యూరిటీలో నిధులు డిపాజిట్ చేస్తే అవి తిరిగి వెనక్కి రావటం కష్టం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ రాష్ట్రము, నిధులు కొరత ఎక్కువగా వుంది. కనుచూపు మేరలో ఈ పరిస్థితి తగ్గే అవకాశం లేదు. కాబట్టి ఒక్కసారి వెంకన్న నిధులు ప్రభుత్వ ఖజానాలోకి వెళితే వెనక్కి తిరిగి రావు. పైగా టీటీడీపై పెత్తనం అనేది అధికార పార్టీదే ఉంటుంది. సీఎంను కాదని టీటీడీ చైర్మన్ చేసేది ఏమి లేదు. కాబట్టి జగన్ కాదుకదా తర్వాత ఏ సీఎం వచ్చిన వెంకన్న నిధులు వెనక్కి ఇవ్వటానికి ఇష్టపడడు. దీనితో ఆ నిధులపై టీటీడీ పూర్తీ నియంత్రణ కోల్పోవటం ఖాయం.

 ఇన్ని సమస్యలు కనిపిస్తున్న కానీ టీటీడీ చైర్మన్ ఆ నిధులను రాష్ట్ర సెక్యూరిటీ లోనే డిపాజిట్స్ చేయాలనీ చూడటం వెనుక కచ్చితంగా ప్రభుత్వ పెద్దల హస్తం ఉంటుంది. ఇవన్నీ సీఎం జగన్ కి తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఇప్పటికే అనేక మంది ఈ విధానాన్ని తప్పు పడుతున్నారు. రేపొద్దున సామాన్య ప్రజానీకం నుండి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి సీఎం జగన్ మరియు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మరోసారి ఈ విషయంలో అలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు.. “రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయి” అనే నానుండి ఉంది. మరోసారి దానిని గుర్తుచేసుకోవాల్సి ఉంటుంది… తస్మాత్ జాగ్రత్త