ఈ మధ్య తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా లగేజీ చార్జీలను కూడా పెంచి షాక్ ఇచ్చింది. దాదాపు 20 ఏళ్ల పాటు లగేజ్ చార్జీలు అలాగే ఉండగా తాజాగా భారీగా పెంచేసింది ఆర్టీసీ. చాలా కాలం నుంచి లగేజ్ చార్జీలో మార్పులు లేనందుకే పెంచాలి అని టాస్క్ ఫోర్ సమావేశంలో నిర్ణయించారని తెలుస్తుంది.
2002 తర్వాత వీటి చార్జీలను పెంచడం ఇదే తొలిసారి. ప్రస్తుతం డీజిల్ ధరలతో పాటు మానవ వనరుల వ్యయాలు పెరగటం వల్ల వీటి చార్జీలు పెంచక తప్పట్లేదు అని ఆర్టీసీ తెలిపింది. కార్గో సేవలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ చార్జీలతో సమానంగా వీటి చార్జీలు పెంచినట్లు తెలిసింది.