కరోనా టీకా రెడీ అయినా… తనకు చెప్పకుండా మోసం చేశారంటున్న ట్రంప్

నన్ను మోసం చేశారు. అమెరికా అధ్యక్షపీఠాన్ని అధీష్టించకుండా కరోనా టీకాపై తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వ్యాక్సిన్ త్వరలో వస్తుందని ప్రపంచానికి ఆ టీకాను అందించిన ఘనత అమెరికాకు దక్కుతుందని తాను ఎన్నికలు ప్రారంభానికి సరిగ్గా ముందు చేసిన ప్రకటన గుర్తు చేశారు. అయితే తన హయాంలో కరోనాకు మందు వస్తే రాజకీయంగా లబ్ది పొందుతానన్న దురుద్దేశ్యంతో ప్రత్యర్థి పార్టీ ప్రోద్భలంతో ఫార్మా కంపెనీలు, కొంత మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు తనని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. సరిగ్గా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన వెంటనే కరోనా టీకా రెడీ అయిందని అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించడమే ఇందుకు సజీవ సాక్ష్యమని అన్నారు.

ఫైజర్  సంస్థ తయారు చేసిన టీకా మూడో దశ ప్రయోగాల్లో సక్సెస్ అయినట్లు ఆ సంస్థే ప్రకటించిందిం. తాము తయారు చేసిన  కొవిడ్‌ టీకా 90శాతం సక్సెస్ ఫుల్ గా పనిచేస్తోందని… కరోనా రూపంలో వచ్చిన అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం త్వరలో ముగుస్తుందని ఫైజర్‌ సీఈవో డాక్టర్‌ అల్బర్ట్‌ బౌర్లా ప్రకటించారు. కరోనా టీకాకు మరికొన్ని రోజుల్లో అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

ఈ ప్రకటనతో ట్రంప్ అగ్గిమీగ గుగ్గిలం అయ్యారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కరోనా టీకా తయారీపై తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని ట్రంప్ మండిపడ్డారు. మరికొన్ని నెలల్లో టీకా అందుబాటులోకి రాబోతోందని తాను ప్రటించి ఉంటే ఫలితాలు పూర్తిగా తనకు అనుకూలంగా వచ్చేవని అన్నారు. అంతా కలిసి తనని మోసం చేశారని ఆరోపించారు. చివరకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా రాజకీయ ప్రయోజనాలనే చూసింది ఆరోపించారు. అయితే టీకా తయారు చేసిన శాస్త్రవేత్తలకు ట్రంప్ అభినందనలు తెలిపారు. మానవాళిని గొప్ప ప్రమాదం నుంచి కాపాడారని కొనియాడారు.