మనం చేసే ఎదవ పనులకు సాయం చేసే వాళ్లే నిజమైన ఫ్రెండ్స్.. వైరల్ అవుతున్న ఇన్ స్టా పోస్ట్!

బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు నటుడు పరిటాల నిరుపమ్. ఈయన బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా ఈయన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రస్తుతం ఈ సీరియల్ కు దూరమయ్యారు. కేవలం ఈ సీరియల్ మాత్రమే కాకుండా బుల్లితెరపై ఎలాంటి సీరియల్స్ లోను నటించలేదు.

ఇకపోతే హిట్లర్ గారి పెళ్ళాం అనే సీరియల్ కి నిర్మాతగా వ్యవహరించిన డాక్టర్ బాబు ఈ సీరియల్ మధ్యలోనే నిలిపివేశారు. ఇలా సీరియల్స్ కి దూరమైన డాక్టర్ బాబు పలు వెబ్ సిరీస్ లలో నటించగ, కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈయన తన భార్య మంజులతో పాటు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నిత్యం ఏదో ఒక యూట్యూబ్ వీడియో ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈయన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన స్నేహితులకు ఎంతో విభిన్నంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని శుభాకాంక్షలు చెబుతూనే మనం చేసే ఎదవ పనులకు ఎవరైతే సహాయం చేస్తారో వాడే నిజమైన స్నేహితుడు..వాళ్లల్లో మంచి ఎదవలు కూడా ఉంటారు అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోకండి అంటూ ఈయన తన స్నేహితులకు మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కి, ఫ్రెండ్స్ కి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసిన పోస్టు వైరల్ అవుతుంది.